Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

సీఎం ప్రసంగం మొత్తం అబద్ధాలే…

: తులసిరెడ్డి
వజ్రోత్సవాలు అనే అచ్చమైన తెలుగు పదాన్ని ఉచ్చరించలేని జగన్‌ తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మానిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95 శాతం అమలు చేసామని చెప్పడం పచ్చి అబద్ద్ధమని అన్నారు. పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండు చేశారు. వికేంద్రీకరణ పట్ల చిత్తశుద్ధి ఉంటే గ్రామ పంచాయితీలు, తదితర స్థానిక సంస్థలకు విధులు, నిధులు, అధికారాలను బదిలీ చేయాలని అన్నారు. సీఎం ప్రసంగం మొత్తం అబద్ధాలే అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img