Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

సీఎం వల్లే ఏపీ అంధకారంలో.. : గోరంట్ల

కరెంట్‌ కోతలతో రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాకుండా పారిపోతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్‌రెడ్డి విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.16 వేల కోట్ల భారం వేశారని మండిపడ్డారు. చేతకాని సీఎం వల్లే ఏపీ అంధకారంలో ఉందని అన్నారు. ధరల నియంత్రణ లేదు.. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించలేదని అన్నారు. కొత్తవారికి దోచుకునేందుకే సీఎం జగన్మోహన్‌రెడ్డి మంత్రివర్గ కూర్పు చేశారని ధ్వజమెత్తారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి రూ.2 వేల నోట్లను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. కనీస వసతులు ఏర్పాటు చేయకుండానే జిల్లాలను విభజించారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img