Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

సీపీఎస్‌పై చర్చలు విఫలం..ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలు

మంత్రి బొత్స సత్యనారాయణ నివాసంలో సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాల నేతలతో జరగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. చర్చలకు పిలిచిన ప్రభుత్వం మళ్లీ పాత అంశాలనే చెప్పిందని నేతలు వాపోయారు. సీపీఎస్‌ అమలు చేస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు రావని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ వెల్లడిరచారని పేర్కొన్నారు. యథావిధిగా సీపీఎస్‌ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. సెప్టెంబర్‌ 1న చలో విజయవాడ, సీఎంవో ముట్టడి కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఉద్యోగులతో భేటీ అనంతరం బొత్స మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 95 శాతం హామీలను నెరవేర్చిందని చెప్పారు. ఇంకా నెరవేర్చని 5 శాతం హామీల్లో సీపీఎస్‌ రద్దు అంశం ఒకటని పేర్కొన్నారు. సీపీఎస్‌ ఉద్యోగులకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనల పైనా చర్చించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సెప్టెంబరు 1న సీపీఎస్‌ ఉద్యోగుల ఆందోళన దృష్ట్యా చర్చలు జరపలేదన్నారు. ఓపీఎస్‌ ఆర్థికభారంగా మారుతుందనే కేంద్రం సీపీఎస్‌ను ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలతో పాటు 5 కోట్ల మంది ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని బొత్స అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img