Monday, March 20, 2023
Monday, March 20, 2023

సీబీఐకి కడప వైసీపీ ఎంపీ లేఖ

కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి మాజీ మంత్రి వైయస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో విచారణకు ఆయన హాజరుకానున్నారు. అయితే అవినీష్‌ రెడ్డి సీబీఐకు లేఖ రాశారు. సీబీఐ విచారణకు హాజరవుతున్నానంటూ లేఖ రాశారు అవినాష్‌ రెడ్డి. ఈ కేసు విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నానని.. అలాగే ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతించాలని కోరారు. విచారణ సమయంలో తనతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతివ్వాలని వైఎస్‌ అవినాష్‌రెడ్డి వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img