Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిఫలమే ఇల్లు : సీఎం జగన్‌

ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదు.సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిఫలమే ఇల్లు అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదవాడికి మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని వారిని నిలదీయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నామ మాత్రపు ధరకు రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తుంటే మీకెందుకు కడుపుమంట అని అడగండి. మా ఇళ్లను ఓటీఎస్‌ లేకుండా మార్కెట్‌ రేట్ల కొంటారా అని అడగండి. మా అన్న ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్‌చేస్తుంటే మీకెందుకు కడుపుమంట అని చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణను ప్రశ్నించాలి’’ అని సీఎం అన్నారు. గృహ పథకం ద్వారా రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నామన్నారు. నామమాత్ర చెల్లింపుతో లబ్ధిదారుల ఇంటిని వారికి సొంతం చేస్తున్నామని చెప్పారు. ప్రతి నిరుపేద ఇంటి యజమాని కావడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సొంతింటి కల నెరవేస్తున్నామన్నారు. ఓటీఎస్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓటీఎస్‌ కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చామన్నారు.‘‘ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంటిపై సర్వహక్కులు కల్పనకే జగనన్న సంపూర్ణ గృహ పథకం. రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మందికి సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్‌. ఈ పథకం కింద దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాఫీ. రూ.6 వేల కోట్ల రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ఛార్జీల మినహాయింపు. 52 లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ రూ.లక్షా 58 వేల కోట్లు. సొంతిల్లు ఉంటే అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని’’ సీఎం అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img