Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

సూర్యలంక తీరంలో విషాదం.. ఏడుగురు విద్యార్థులు గల్లంతు

ఏపీలో బాపట్లలోని సూర్యలంక సముద్రతీరంలో విషాదం చోటుచేసుకుంది. తీరంలో స్నానానికని వెళ్లి ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థుల్లో ఇద్దరిని గజ ఈతగాళ్లు ప్రాణాలతో రక్షించారు. కాగా.. మరో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. చనిపోయిన విద్యార్థులు.. విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన సిద్ధు, అభి, సాయి మధుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img