Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

స్పెషల్ ఫ్లైట్‌లో వైసీపీ ఎమ్మెల్యే, వీల్ ఛైర్‌లో టీడీపీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు పరుగులు

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠరేపాయి. వైఎస్సార్‌‌సీపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12.30కు 174మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. కానీ మధ్యాహ్నానికి విజయనగరం జిల్లా నెల్లిమర్ల వైఎస్సార్‌సీపీ అప్పలనాయుడు ఓటు మాత్రం వేయలేకపోయారు. ఆయన కుమారుడి వివాహం ఉండటంతో ఆయన రాలేకపోయారు. దీంతో అప్పలనాయుడు వివాహ వేడుక పూర్తి చేసుకుని ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వీల్ ఛైర్‌లో వచ్చి ఓటు వేశారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.. అయినా సరే వచ్చి ఓటు వేశారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందు మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఓటు వేయగా.. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు అంతా ఒకేసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చంద్రబాబు వెంట నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డోలా బాలవీరాంజనేయస్వామి, నిమ్మలరామానాయుడుతో పాటూ పలువురు తెలుగు దేశం ఎమ్మెల్యేలు అంతా ఒకేసారి వచ్చి ఓటు వేశారు.

మరోవైపు వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (ఖశ్‌ీaఎ Rవససవ ూతీఱసష్ట్రaతీ Rవససవ)ఓటు వేశారు. అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ముందు చెప్పినట్లుగానే ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేశానన్నారు. తాను ఎవరికి ఓటు వేశానో చెప్పటం ధర్మం కాదని.. ఆ ప్రశ్న అడగకూడదన్నారు. తాను ఎవరికి ఓటు వేశానో చెప్పకూడదన్నారు. అలాగే ఎవరు ఎవరికి ఓటు వేశారో తనకు తెలియదని.. తాను మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకున్నాను అన్నారు. మరోవైపు ఆనం కూడా తన ఓటు వేశారు. మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 22మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ఏడు స్థానాలు గెలుచుకోవాలంటే.. వైఎస్సార్‌సీపీకి 154 మంది ఎమ్మెల్యేల బలం కావాలి.. అయితే అధికార పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి తోడు టీడీపీ నుంచి దూరంగా ఉంటున్న నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి రెబల్స్‌గా చెప్పాలి.. అయితే వారు వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వారిద్దరు పరిగణలో లేకపోయినా.. టీడీపీ నుంచి వచ్చిన నలుగురు, జనసేన ఒక్క ఎమ్మెల్యే కలిస్తే మాత్రం ఆ బలం 154కు చేరుతుంది.

ఇటు టీడీపీకి లెక్క ప్రకారం 23మంది సభ్యులు ఉన్నారు.. వారిలో నలుగురు అధికార పార్టీకి దగ్గరయ్యారు. దీంతో టీడీపీ బలం 19కు పడిపోయింది. అయితే వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి ఓట్లు తమకు పడతాయని టీడీపీ ఆశలు పెట్టుకుంది.. మరో ఓటు వస్తే చాలు గెలుపు ఖాయమని ధీమాతో ఉన్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌‌లో ఉన్నారంటూ మైండ్ గేమ్ ఆడుతోంది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్‌లో కానీ ఫలితం తేలదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img