Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

స్వగ్రామం పొన్నవరంలో సీజేఐ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ఏపీలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం స్వగ్రామమైన కృష్ణా జిల్లా పొన్నవరానికి చేరుకున్నారు.సీజేఐ హోదాలో తొలిసారి పొన్నవరం వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణకు ఎడ్ల బండిపై అధికారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పొన్నవరంలోని శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థుల పౌరసన్మాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు.. ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెడుతున్న సీజేఐకు అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌ గరికపాడు వద్ద ఘన స్వాగతం లభించింది. వివిధ ప్రాంతాలకు చెందిన జడ్జీలు, విద్యార్థులు పుష్ప గుచ్చాలు ఇచ్చి గ్రాండ్‌ వెల్‌ కమ్‌ చెప్పారు ఎన్వీ రమణకు. సీజేఐ పర్యటన నేపథ్యంలో భారీ స్థాయిలో రెవెన్యూ పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img