ఏపీ హైకోర్టును కర్నూలుకు మార్చే ప్రతిపాదనేదీ పెండిరగ్లో లేదని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ మరోసారి తేల్చి చెప్పింది. గురువారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్‌రిజిజు మాట్లాడుతూ, విభజన చట్టానికి అనుగుణంగా 2019 జనవరిలో..ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కేంద్రం ఏర్పాటు చేసిందని చెప్పారు. 2020 ఫిబ్రవరిలో హైకోర్టును అమరావతి నుంచి.. కర్నూలుకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. హైకోర్టును కర్నూలుకు మార్చడంపై ఏపీ ప్రభుత్వం, హైకోర్టు.. తమ అభిప్రాయాన్ని కేంద్ర న్యాయశాఖకు సమర్పించాలన్నారు. ప్రస్తుతం కేంద్రం దగ్గర ఎలాంటి ప్రతిపాదన పెండిరగ్లో లేదని కిరణ్‌రిజిజు స్పష్టం చేశారు.