Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అంత తీరిక లేదా.. గాంధీ, తిలక్‌ల కంటే గొప్పవారా మీరు?

సీఎం స్పెషల్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డిపై హైకోర్టు సీరియస్‌
కోర్టు ధిక్కారణ కేసులో విచారణకు గైర్హాజరైన సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.జవహర్‌రెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ముందు హాజరయ్యే సమయం లేదా అంటూ ప్రశ్నించింది.. సమావేశం ఉందనే కారణంతో కోర్టుకు రాకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాలుంటాయా అంటూ ప్రశ్నించింది. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రోజుకు ఎన్ని గంటలు సమావేశాల్లో పాల్గొంటారో సీఎం పేషీ నుంచి వివరాలు తెప్పించుకోగలమని ఘాటుగా స్పందించింది. మహాత్మా గాంధీ, బాలగంగాధర్‌ తిలక్‌ వంటి మహోన్నత వ్యక్తులూ కోర్టులు ఇచ్చిన ఆదేశాలను గౌరవించారని.. వారు కోర్టుల్లో హాజరయ్యారని వ్యాఖ్యానించింది. వారికన్నా ‘మీరు గొప్పవారా’ అంటూ ప్రశ్నించింది. భవిష్యత్తులో కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని కోర్టు గుర్తిస్తే వివరణ తీసుకోకుండానే నేరుగా నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తామని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలను పాటించకపోతే ఏమీ కాదులే అనే భావనతో ఉండొద్దని వ్యాఖ్యానించింది. అలాగే మిగిలిన అధికారులు హాజరు కావడంతో పాటూ.. పిటిషనర్‌కు చెల్లించాల్సిన వేతన బకాయిలన్నింటినీ చెల్లించడంతో కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేసింది హైకోర్టు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img