Friday, April 19, 2024
Friday, April 19, 2024

అక్కాచెల్లెమ్మలపై కురిపించిన ఆప్యాయత ఎక్కడికి పోయింది? : నారా లోకేష్‌

ఏపీలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. వైసీపీ ముసుగు కప్పుకున్న నీచులు… ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు. ‘అక్కాచెల్లెమ్మలపై కురిపించిన ఆప్యాయత ఎక్కడికి పోయింది జగన్‌ గారూ?’ అని వ్యాఖ్యానించారు. మద్యపాన నిషేధం వరం ఇస్తున్నానని జగన్‌రెడ్డి తెలిపారు. సొంత మద్యాన్ని అమ్ముతూ అక్కాచెల్లెమ్మల పుస్తెలు తెంపేస్తున్నారని నారా లోకేష్‌ పేర్కొన్నారు.. మహిళా ద్రోహిగా సాగుతున్న జగన్‌ రెడ్డి పాలనని నిరసిస్తూ… ఈ నెల 31న తెలుగు మహిళ ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష నిర్వహించనున్నామని తెలిపారు. భద్రత, భవిష్యత్‌ కోసం మహిళలు సాగించే పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని నారా లోకేష్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img