Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

అధికారంలోకి రావడంపైనే దృష్టిపెట్టాలి : పార్టీ నేతలతో చంద్రబాబు

ఈసారి అధికారంలోకి రావడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాలి. నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం నోఛాన్స్‌ అంటూ టీడీపీ నేతలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్‌ ఇచ్చారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో వన్‌-టు-వన్‌ మీటింగ్స్‌ నిర్వహిస్తున్న ఆయన వచ్చే ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలంటూ పార్టీ శ్రేణులకు సూచించారు. 2024 ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్‌ పెంచారు. అసెంబ్లీ అండ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా వన్‌ టు వన్‌ మీటింగ్స్‌ నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర టైమ్‌ మాత్రమే ఉండటంతో ఇప్పటి నుంచే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు దిశా నిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలంటూ ఆదేశించారు. 2024 లో పార్టీ అధికారంలోకి రావాలంటే నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజల్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలకు క్లాస్‌ పీకారు చంద్రబాబు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. జిల్లా విభజన తర్వాత నేతల మధ్య కోఆర్డినేషన్‌ కరవైందంటూ అసహనం వ్యక్తంచేశారు. ఎందుకు కలిసి పనిచేయలేకపోతున్నారని ప్రశ్నించారు. పార్టీ సభ్యత నమోదులోనూ వెనకబడారని అన్నారు. ఇకపై ప్రతి నేత పనితీరును సమీక్షిస్తానని చెప్పారు. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తే కౌంటర్‌గా ప్రైవేట్‌ కేసులు వేయాలని సూచించారు. మంగళగిరి నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అత్యధిక మెజార్టీతో మంగళగిరిని గెలిచి చరిత్ర తిరగ రాయాలని నారా లోకేశ్‌కు దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img