Friday, April 19, 2024
Friday, April 19, 2024

అనుప్పల్లెలో జల్లికట్టు.. ముగ్గురికి గాయాలు

నేడు భోగి సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అనుప్పల్లెలో జల్లికట్టు పోటీలు నిర్వహించారు. దాంతో జల్లికట్టును చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దాంతో అనుప్పల్లె గ్రామం ఇసుకేస్తే రాలనంతగా క్రిక్కిరిసిపోయింది. కాగా, ఈ పోటీల్లో ముగ్గురికి గాయాలైనట్టు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా తమిళనాడులోనూ, తమిళనాడు-ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారు. జల్లికట్టులో భాగంగా బలమైన ఎద్దులను బరిలోకి వదిలి వాటి కొమ్ములకు కట్టిన జెండాలను చేజిక్కించుకునేందుకు యువత పోటీలు పడుతుంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img