Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అప్రమత్తంగా ఉండాలి

తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్‌
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సహాయక చర్యలపై సమీక్ష జరిపారు.ఇప్పటికే తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను జిల్లాలకు ప్రభుత్వం పంపింది. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమని’’ కలెక్టర్లు, అధికారులకు సీఎం సూచించారు.‘కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశం. అయినా ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి. అవసరమైన చోట సహాయపునరావాస శిబిరాలను తెరవండి. సహాయ శిబిరాలకు తరలించిన ఒక వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2వేల చొప్పున ఇవ్వండి. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయండి.’ అని అన్నారు. సెంట్రల్‌ హెల్ప్‌ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు సమర్థవంతగా పనిచేసేలా చూడాలి. వచ్చే కాల్స్‌ పట్ల వెంటనే స్పందించండి. ఈ నంబర్లకు బాగా ప్రచారం కల్పించాలని’’ సీఎం పేర్కొన్నారు.
కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు
కాకినాడ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 18004253077
కాకినాడ ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 0884-2368100
శ్రీకాకుళం: 08942-240557
తూర్పు గోదావరి: 8885425365
ఏలూరు కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 18002331077
విజయనగరం: 08922-236947
పార్వతీపురం మన్యం: 7286881293
మచిలీపట్నం కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08672 252572
మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08672 252486
బాపట్ల కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 8712655878, 8712655881
ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 90103 13920
విశాఖ: 0891-2590100,102
అనకాపల్లి: 7730939383

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img