Friday, April 19, 2024
Friday, April 19, 2024

అయితే..హైదరాబాద్‌ నుంచే పాలించండి.. : అచ్చెన్నాయుడు

ఏపీలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ వ్యవస్థలపై దాడిని గవర్నర్‌ అడ్డుకోవడం లేదని ఆరోపిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. వైసీపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలపై దాడి జరిగినా గవర్నర్‌ స్పందించలేదని, తన పేరు మీద ప్రభుత్వం అప్పులు తీసుకువచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. ఇక రాజధానిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై కూడా అచ్చెన్న స్పందించారు. ‘ఏపీ రాజధాని హైదరాబాదే అయితే..అక్కడికే వెళ్లిపోండి. రాష్ట్రం నుంచి పాలించాలనే మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు హైదరాబాదే రాజధాని అంటే ఏం చేయగలం? అని అచ్చెన్నాయుడు అన్నారు. విభజన చట్టం ప్రకారం 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదు అని బొత్స అన్నారు. అమరావతి రాజధానిగా పార్లమెంటు నుంచి ఆమోదం రాలేదని, రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందని చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా బొత్స అసెంబ్లీ వద్ద మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img