Friday, April 19, 2024
Friday, April 19, 2024

అర్చకుల అధీనంలోని భూముల పర్యవేక్షణ దేవాదాయశాఖదే…

ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 21 మంది సభ్యులతో పూర్తిస్థాయి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసినట్లు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..అర్చకుల అధీనంలోని భూముల పర్యవేక్షణ బాధ్యత దేవాదాయశాఖదేనని స్పష్టం చేశారు. భూముల ఫలసాయం మాత్రమే అర్చకులు అనుభవించవచ్చని వివరించారు. దేవుడి మాన్యం భూములపై హక్కులు దేవాదాయ శాఖకు చెందుతాయని వెల్లడిరచారు. దేవాదాయ శాఖ అధీనంలో 4.2 లక్షల ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ భూముల్లో కొన్ని ఆక్రమణలో ఉన్నాయని అన్నారు. దేవుడి మాన్యాల్లో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మఠాలు, పీఠాల భూముల లీజు, పొడిగింపు తదితర వ్యవహారాలను ధార్మిక పరిషత్‌ చూసుకుంటోందని వెల్లడిరచారు. రాష్ట్రంలో 3,500 ఆలయాలు ధూపదీప నైవేద్యాలకు నిధులు కోరాయని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి గుడికి ధూపదీప నైవేద్యం పథకం కింద నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.ఇక దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉందని, నిబంధనల ప్రకారమే రెవెన్యూ శాఖ సిబ్బందిని తీసుకుంటున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img