Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అలా చేసుంటే జనసేనకు 40 సీట్లు వచ్చేవి.. నా టార్గెట్‌ అది కాదు: పవన్‌ కళ్యాణ్‌

మంగళగిరిలోని కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్స వేడుకల్లో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జనసైనికులకు దిశా నిర్దేశం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమం స్ఫూర్తితో జనసేన పార్టీని స్థాపించామన్నారు. తనకు కులాల గురించి అప్పట్లో తెలిసేది కాదని.. ఒక కులాన్ని వర్గ శత్రువుగా భావించడం సరికాదన్నారు. కులాలను ఆపాదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తనకు దగ్గరైన వ్యక్తి ఆనంద్‌ సాయి.. యాదాద్రికి ఆర్కిటెక్ట్‌గా ఉన్నపుడే అతను బీసీ అని తెలిసిందన్నారు.ఒక్క కులం చూసుకుని రాజకీయం చేసి ఉంటే జనసేనకు 40 సీట్లు వచ్చి ఉండేవన్నారు పవన్‌. వైఎస్సార్‌సీపీ నేతలు వాళ్ల భావాలను తమపై రుద్దడం సరికాదని.. జనసేన అధికారంలోకి వస్తే వ్యవస్థల్ని బలోపేతం చేస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఢల్లీి వెళ్లి ఏం చేస్తారో తనకు బాగా తెలుసుని.. మభ్యపెట్టే రాజకీయాలపై ప్రజల్లో మార్పు రాకపోతే ఏం చేయలేమని వ్యాఖ్యానించారు. చొక్కా పట్టుకుని అడిగే విధానం ప్రజల్లో రావాలని.. ప్రజలకు అధికారులు జవాబుదారీ కావాలని.. వైఎస్సార్‌సీపీ నేతలకు కాదన్నారు. ఇప్పుడు కేసులు పెడితే భవిష్యత్‌లో వారిపై కూడా కేసులుంటాయని.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. 151 సీట్లలో గెలిపించింది ప్రజలపై దాడి చేసేందుకా అని ప్రశ్నించారు పవన్‌. ఓ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే గుడివాడలో ఇసుక దందా నడుస్తోందని.. అక్రమ సంపాదనతో ఒక్కో ఎమ్మెల్యే కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. ప్రజలపై దాడి చేసేందుకే సీఎం అధికారాన్ని వాడుతున్నారన్నారు. తాను ఓ కులం కోసం రాజకీయాల్లోకి రాలేదని.. వైఎస్సార్‌సీపీ నేతలు పద్దతి మార్చుకోవాలన్నారు. దేశంలో ప్రతి ఒక్కరి భాష, యాసలను గౌరవించాలని.. కులం, మతం కోసం పోరాటాలు కాదు.. దేశం కోసం చేయాలన్నారు. మత ప్రాతిపదికన లేని రాజకీయాలు ఉండాలన్నారు. నాయకులు కేవలం ఓట్లు కోసం మత రాజకీయాలు చేయడం సరికాదన్నారు జనసేనాని. దేశానికి వెన్నెముక భారతీయ సంస్కృతి.. ఓట్లు వస్తాయో లేదో తెలియదు కానీ వాస్తవాలు మాత్రమే తాను మాట్లాడతాను అన్నారు. మతాల ప్రస్తావనలేని రాజకీయం జనసేన లక్ష్యమని.. రామతీర్థం ఘటనలో ఖండిచాం తప్ప.. రెచ్చ గొట్టలేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం మత ప్రస్తావన తీసుకొచ్చే వారిని.. తప్పులు చేసే వారిని జన సైనికులు, నేతలు ముక్త కంఠంతో ఖండిరచాలన్నారు.
ఎందరో యోధుల త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్య్రం అన్నారు పవన్‌. ఎవరినైనా కలపడం కష్టం.. విడదీయడం సులభం అన్నారు. కుల, మత ప్రస్తావన లేని రాజకీయాలు దేశానికి కావాలని.. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం కావాలి అని వ్యాఖ్యానించారు. విశాఖ పరిశ్రమల కాలుష్యం కానీ.. ఆక్వా వల్ల నీరు, భూమి కాలుష్యమైందని.. వీటిని కాపాడటమే జనసేన బాధ్యతన్నారు. ఒక మసీదు, ఒక చర్చికి అపవిత్రం జరిగితే ఎలా ఖండిస్తామో.. దేవాలయాలకు అలాంటి పరిస్థితి వస్తే అంతే బలంగా ఖండిస్తామన్నారు.. అదే సెక్యులరిజం అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img