Friday, April 26, 2024
Friday, April 26, 2024

అశోక్‌బాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయస్థానం బెయిల్‌ పిటిషన్‌ను నిరాకరించింది.లోకాయుక్తను పార్టీగా చేయాల్సిందిగా పిటిషనర్లకు సూచించింది. అలాగే దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీ అధికారులకు ఆదేశిస్తూ తదుపరి కేసు విచారణను సోమవారం నాటికి వాయిదా వేసింది.అశోక్‌బాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పదోన్నతి కోసం నకిలీ విద్యార్హతలను చూపించారన్న ఆరోపణలపై ఆయనను గురువారం రాత్రి పొద్దుపోయాక విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు.అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పని చేసి రిటైర్‌ అయ్యారు. అయితే… డిగ్రీ చదవకుండానే చదివినట్లుగా చూపించారని ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉమ్మడి రాష్ట్రంలోనే శాఖాపరమైన విచారణ జరిగింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని అశోక్‌బాబు అప్పట్లో వివరణ ఇచ్చారు. దీనిపై విజిలెన్స్‌ అధికారులు కూడా విచారణ జరిపి… ఆయనపై అభియోగాలను ఉపసంహరించారు. తాజాగా… పీఆర్సీపై రగడ రగులుతున్న సమయంలోనే అశోక్‌బాబుపై వైసీపీ ప్రభుత్వం మరోమారు పాత ఆరోపణలను బయటికి తీసింది. తమకు అందిన ఫిర్యాదు మేరకు… విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీకి లోకాయుక్త సూచించింది. దీంతో సీఐడీ వెంటనే కేసు నమోదు చేయడం జరిగిపోయింది. గురువారం ఆయనను అదుపులోకి కూడా తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img