Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ఏఐటీయూసీ, జిల్లా నాయకులు మల్లికార్జున

విశాలాంధ్రఉరవకొండ : అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పించాలని ఎఐటియుసి డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ మల్లికార్జున అన్నారు. శుక్రవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులతొ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 44 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్‌ లు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం యొక్క కుట్ర దాగి ఉందన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల కార్మికులకు పని భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. దేశంలో లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ను సైతం ప్రైవేటుపరం చేసి బడా పారిశ్రామిక నేతలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాము అధికారంలోకి వస్తే కార్మికులకు కనీస వేతన చట్టం, బోనస్‌, పిఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ సదుపాలను కల్పిస్తామని హామీ ఇచ్చి, వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. అంతేకాకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాల బిల్లుకు వైఎస్‌ఆర్సిపి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు. రైతులకు కూడా ఉచిత విద్యుత్‌ ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కుట్రలు చేస్తోందని అందులో భాగంగానే మోటార్లకు మీటర్లను బిగించడం జరుగుతుందన్నారు. దీనిని ప్రతి ఒక్కరు కూడా ఖండిరచాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా అసంఘటిత కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఐటియు సి కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. కార్మిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జే మల్లికార్జున, సహాయ కార్యదర్శి వన్నూరు సాహెబ్‌, ఎ ఐటియుసి జిల్లా నాయకులు మల్లికార్జున, తాలూకా కార్యదర్శి చెన్నా రాయుడు, సిపిఐ వజ్రకరూరు కార్యదర్శి సుల్తాన్‌, రమేష్‌ హనుమంతు,తోపుడు బండ్లు నాయకులు చక్రధర్‌,గంగాధర్‌ చెన్నారాయుడు వివిధ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img