Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించిన సీఎం జగన్‌

కరోనా మహమ్మారి మరోసారి కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ కారణంగా ఆక్సిజన్‌ కొరతను దృష్టిలో ఉంచుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ముందస్తు చర్యలు ప్రారంభించారు. అయితే, తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను జాతికి అంకితం చేస్తున్నామని తెలిపారు. 100 పడకలు ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లపై 30 శాతం సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు.మనమే సొంతంగా ఆక్సిజన్‌ సరఫలా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒమిక్రాన్‌ ప్రభావంతో కేసులు వేగంగా విస్తరిస్తోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఈ ప్లాంట్లు కొవిడ్‌ బారినపడ్డ వారికి చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయన్నారు.రూ.426 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందుకుగాను రూ.20 కోట్ల వ్యయంతో ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ కంటైనర్లను కొనుగోలు చేశారు. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్‌ పైప్‌లైన్లు సౌకర్యం కల్పించనున్నారు. మొత్తం 39 లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటు చేశారు. కోవిడ్‌తో పాటు ఇతర చికిత్సలకు 20 అత్యాధునిక ఆర్టీపీసీఆర్‌ వైరల్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img