Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఆ అధికారం కోర్టులకు లేదు: ధర్మాన ప్రసాదరావు

అసెంబ్లీలో చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధమైతే ఆ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. కానీ కోర్టులు ప్రభుత్వాన్ని నడపలేవని ఆయన స్పష్టం చేశారు. మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ప్రజాభిప్రాయం కేవలం శాసన వ్యవస్థలోనే ప్రభావితం అవుతుందని.. శాసనసభ అధికారాల విషయంలో కోర్టుకు అభ్యంతరాలుంటే ఎన్నికలెందుకని ఎమ్మెల్యే ధర్మాన ప్రశ్నించారు. శాసనసభను ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఎన్నుకొన్నారని గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించకూడదని.. అధికార విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు అన్న విషయాన్ని కోర్టులు గుర్తుపెట్టుకోవాలని.. సమానమైన హక్కులు, అధికారాలు మూడు వ్యవస్థలకు కూడా ఉన్నాయన్నారు మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పు సున్నితమైందన్నారు. బాధ్యతలను కట్టడిచేసే విధంగా హైకోర్టు తీర్పు ఉందన్నారు. కోర్టులంటే అందరికీ గౌరవం ఉందన్నారు. గతంలో రాజరిక వ్యవస్థ ఉండేదని, రాజు ఏం చెబితే అది నడిచేదన్నారు. అధికారం రాజు దగ్గరే కేంద్రీకృతం కావడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. అక్కడి నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిందని ఆయన పేర్కొన్నారు.జ్యుడీషియల్‌ యాక్టివిజం దిశలేని మిసైల్‌ లాంటిదని ఆయన అభివర్ణించారు. చట్టసభలు, అధికారుల విధుల్లో కోర్టులు కలగజేసుకుంటే ఓటర్లు, రాజకీయ నాయకులు వారి విషయాన్ని సమీక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇదే జరిగితే న్యాయవ్యవస్థ స్వతంత్రతను కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. అధికార యాంత్రాంగాన్ని కోర్టు తీర్పులు చికాకు పెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించకూడదన్నారు. కానీ సమీక్షించే అధికారం పౌరులకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. న్యాయవ్యవస్థతో పాటు మిగిలిన రెండు వ్యవస్థలు సమానమేనని సుప్రీంకోర్టు చెప్పిందని ఆయన గుర్తు చేశారు. చట్టాల చేసే అధికారం కేవలం శాసనవ్యవస్థకే ఉందన్నారు. రాజ్యాంగంలో ఇదే స్పష్టంగా ఉందన్నారు. విశ్లేషణలను నిపుణుల కమిటీలు చేయాలి కానీ కోర్టులు ఆ పని చేయకూడదన్నారు. కోర్టులు తమ పరిధి దాటి కార్యనిర్వాహక పనిలో జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ప్రజలకు మంచి చేయకుండా అడ్డుకుంటే నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. అసమానతలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. దాని కోసమే కొత్త విధానాలను తీసుకొస్తుందన్నారు. విధానాల్ని మార్చే అధికారం శాసనసభకే ఉందని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img