Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఈ నెల 11 వరకు విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దయ్యాయి. రైల్వే ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 9 నుంచి 11 వరకు కొన్ని రైళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు.. ఒక రైలును పాక్షికంగా రద్దు చేశామని ప్రకటించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.ఈ నెల 9, 10న విజయవాడ-గూడూరు (07500), విజయవాడ-బిట్రగుంట (07978), ఒంగోలు-విజయవాడ (07576) రైళ్లు రద్దయ్యాయి. అలాగే ఈ నెల 10న విజయవాడ-ఒంగోలు (07461), విజయవాడ-గుంటూరు (07783)తో పాటూ కాకినాడ పోర్టు-విశాఖపట్నం (17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు (17268), బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌ (17237), చెన్నై సెంట్రల్‌-బిట్రగుంట (17238) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.ఈ నెల 10, 11న గూడూరు-విజయవాడ (07458) రద్దు చేసినట్లు వివరించారు. అలాగే కాకినాడ పోర్టు-విజయవాడ (17258) ట్రెయిన్‌.. ఈ నెల 10న కాకినాడ పోర్టు-రాజమండ్రి మధ్య.. విజయవాడ-కాకినాడ పోర్టు (17257) రైలును ఈ నెల 9, 10న రాజమండ్రి-కాకినాడ పోర్టు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు తెలియజేశారు. ఈ మార్పుల్ని గమనించి ప్రయాణాలకు ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img