Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఉక్కు కర్మాగారాన్ని అమ్మితే ఊరుకోం

నినాదాలు చేస్తూ హైవే ఎక్కిన ఉక్కు కార్మిక వర్గం
జాతీయ రహదారి పై స్తంభించిన ట్రాఫిక్‌..

విశాలాంధ్ర ` కూర్మన్నపాలెం: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మితే ఊరుకునేది లేదని అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి స్పూర్తి తో విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామనే వరకు పోరాటం కొనసాగిస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ స్పష్టం చేసింది. భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యం లో కూర్మ న్న పాలెం కూడలి లో పరి రక్షణ పోరాట కమిటి నేతలు ఉక్కు పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు, నిర్వాసితులు, రాజకీయ పక్ష పార్టీలకు చెందిన నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతి నిధులు నల్ల బ్యాడ్జీలు ధరించి ,నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది ఉక్కు ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు ను అమ్మితే ఊరుకోం, ఎవడురా అమ్మేది, ఎవడురా కొనేది అనే నినాదాలతో కూర్మ న్న పాలెం కూడలి మార్మోగింది. ఉదయం 8 గంటలకే ఉక్కు దీక్షా శిభిరం వద్దకు వందలాది మంది ఉద్యోగులు చేరుకున్నారు. ఉద్యోగుల నిరసన తో జాతీయ రహదారి లో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కూర్మన్నపాలెం కూడలి నుండి పాత గాజువాక కూడలి వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. ఈ సందర్భంగా పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ , మంత్రి రాజశేఖర్‌ , సి.హెచ్‌ నర్సింగరావు లు మాట్లాడుతూ భీమవరం లో అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణకు నరేంద్ర మోదీ వస్తున్న సందర్భంగా కూర్మ న్న పాలెం కూడలి లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్ముతున్న నరేంద్ర మోదీ కి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తాకే నైతిక హక్కు లేదన్నారు . ఎన్నో పోరాటాలు , ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడు కుంటా మని అన్నారు. నరేంద్ర మోదీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకుంటా మని అన్నారు. భీమవరం వేదికగా జరిగే సభలో ఉక్కు ను ప్రభుత్వ రంగ పరిశ్రమ గా కొన సాగిస్తామని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలనీ డిమాండ్‌ చేశారు. ఇంకా ఈ నిరసన ప్రదర్శనలో పోరాట కమిటీ ప్రతినిదులు కె.ఎస్‌.ఎన్‌ రావు, జె.రామకృష్ణ, గంధం వెంకట్రావు, నీరు కొండ రామచంద్రరావు, వై.టి.దాస్‌, వై. మస్తానప్ప, విల్లా రామ్మోహన్‌ కుమార్‌ , వరసాల శ్రీనివాస రావు , బొడ్డు పైడి రాజు, బి.డేవిడ్‌ , డి.సురేష్‌ బాబు , మహాలక్ష్మి నాయుడు, రమేష్‌ కుమార్‌ , గణపతి రెడ్డి , జగదీష్‌ , డి.సంపూర్ణం , కె రాజబాబు , గుమ్మడి నరేంద్ర , జి.బోసు బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img