Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఏపీ అసెంబ్లీలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసనసభ ఆమోదం లభించింది. వైఎస్సార్‌ హెల్త్‌ వర్సిటీగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈరోజు అసెంబ్లీలో మంత్రి విడుదల రజనీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. మంత్రి సభలో మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నవారికి ఎన్టీఆర్‌ పేరు గుర్తోస్తోందని, అధికారం ఉంటే ఓ లాగా అధికారం లేకపోతే మరోలా చెబుతారన్నారు. 8 మెడికల్‌ కాలేజీలను వైఎస్సార్‌ 11కు చేశారని..దానిని జగన్‌ 28 మెడికల్‌ కాలేజీలకు చేర్చారని చెప్పుకొచ్చారు. అందుకే ఆ క్రెడిట్‌ మనం తీసుకోవాలనే .. వైఎస్‌ఆర్‌ పేరు పెట్టామని తెలిపారు.ఎన్టీఆర్‌ మీద జగన్‌కు గౌరవం ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img