Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించారు


: చంద్రబాబు నాయుడు
దొంగ ఓటర్లను పట్టించినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలపై సోమవారం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఇన్ని కుట్రలా?.. ఇలాంటి పనులు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. టీడీపీ నేతలను నిర్బంధించి, ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారన్నారు. బయట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కుప్పం వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు సైతం దొంగలకు వంత పాడుతున్నారన్నారని విమర్శించారు. దొంగ ఓటర్లను పట్టుకున్నవారిపై పోలీసులు లాఠీచార్జ్‌ చేస్తారా? అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అక్రమాలు, అరాచకాలే కనిపిస్తున్నాయన్నారు. అధికార పార్టీకి అడ్డూ.. అదుపు లేకుండా పోయిందన్నారు. ఏం చేసినా చెల్లుతుందనే ధీమాలో వైసీపీ ఉందని, హద్దులు మీరితే పరిస్థితులు చేయి దాటిపోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. త్వరలో వైసీపీకి ప్రజలే సరైన సమాధానం చెబుతారన్నారు. అసలు రాష్ట్రంలో ఎస్‌ఈసీ ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ అక్రమాలపై ఆధారాలిచ్చినా స్పందించడం లేదని, ఫిర్యాదులను పట్టించుకోకుండా టీడీపీ నేతలను అరెస్ట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img