Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎన్ని కుట్రలు చేసినా ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటాం: లోకేశ్‌

విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమై నేటితో ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కంటూ నినదిస్తున్న కార్మికులకు ఉద్యమాభివందనాలు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గల్లీ నుంచి ఢల్లీి వరకూ, అసెంబ్లీ నుంచి పార్లమెంట్‌ వరకూ టీడీపీ నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉందని నారా లోకేష్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకూ పోరాటం ఆపేది లేదని ప్రకటించిన కార్మికులు అదే స్ఫూర్తితో నేటికీ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.పదుల సంఖ్యలో ఉద్యమకారుల ప్రాణత్యాగాలతో ఏర్పాటై, వేలాది మందికి ఉపాధి కల్పతరువుగా మారిన విశాఖ ఉక్కుని కాపాడటానికి సీఎం జగన్‌ రెడ్డి, వైసీపీ ఎంపీలు కనీస ప్రయత్నం చెయ్యకుండా చేతులెత్తేయడం బాధాకరమన్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని నారా లోకేష్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img