Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఎపి నుంచి నేరుగా హాజ్ యాత్ర

  • ఆంధ్రప్రదేశ్‌ నుండి యాత్రికులు నేరుగా హజ్‌ యాత్రకు వెళ్లేందుకు తొలిసారి ఎంబార్కింగ్‌ పాయింట్‌ సాధించినట్లు ఉప ముఖ్య మంత్రి (మైనారిటీ సంక్షేమశాఖ) అంజాద్‌ బాషా తెలిపారు. ఏపీఐఐసీ కార్యాలయంలో హజ్‌ కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అంజాద్‌ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలిసారి గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏర్పాటు- చేసిన ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుండి 1,813 మంది యాత్రికులను నేరుగా పవిత్ర హజ్‌ యాత్రకు పంపనున్నామన్నారు. వచ్చే నెల 7నుంచి 19 వరకు సాగే యాత్రలో భాగంగా ప్రతి రోజూ 155 మంది వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొత్తగా ఎంబార్కేషన్‌ పాయింట్‌ వచ్చాక వివిధ విమానయాన సంస్థల నుంచి టెండర్లు పిలిచామన్నారు. యాత్రికులను రాష్ట్రం నుంచి తీసుకెళ్లి, తీసుకొచ్చేలా టెండర్లు పిలిచామని తెలిపారు. హైదరాబాద్‌, బెంగుళూరు ఎంబార్కేషన్‌ నుండి వెళ్లే ప్రతి ఒక్క యాత్రికుడి మీద రూ.80,000 అదనంగా భారం పడుతున్న నేపధ్యంలో ఆ మొత్తాన్ని కూడా ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని, మొత్తం రూ.14.51 కోట్ల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించడం విశేషమన్నారు. హాజ్‌ యాత్రికులకు గుంటూరు జిల్లా నంబూరులోని మదరసాలో వసతి ఏర్పాటు చేశామన్నారు. యాత్రికుల లగేజ్‌ను అక్కడే స్కానింగ్‌ చేసి నేరుగా, నాలుగు ఆర్టీసీ ఏసీ ప్రత్యేక బస్సులలో గన్నవరం తరలించనున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img