Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఏపీకి భారీ వర్షసూచన

ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిరది. కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలోని ఆవర్తనం సోమవారం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఆవర్తనంలో విలీనం కానున్నది. ఈ ఆవర్తనం ప్రభావంతో కోస్తాలో ఎక్కువచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీకి ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నెల మూడు, నాలుగు, ఐదు తేదీల్లో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందన్నారు. గాలులు బలంగా వీచే అవకాశం ఉందని.. భారీ నుంచి అతి భారీ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. సోమవారం మధ్యాహ్నం నుంచి కోనసీమ, ఉత్తరాంధ్ర, కాకినాడ జిల్లాల్లో వర్షాలు మొదలవుతాయని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటున్నారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని చెప్పారు. అలాగే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయసీలమలోని మిగిలిన జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వర్షాలు పడతాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img