Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపీకి మరో వాయు‘గండం’

భారీవర్షాలు, వరదలు ముంచెతుతున్న ఏపీకి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులో వాయుగుండం బలహీనపడిరది. ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్నాటక ప్రాంతాల్లో.. ఈ వాయుగుండం అల్పపీడనంగా మారింది దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తారు వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ వెల్లడిరచింది.ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత నలభై ఏళ్లలో ఎప్పుడూ చూడని జలప్రళయం రాయలసీమపై దండెత్తింది చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో నలభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. ఆకాశానికి చిల్లుపడిరదా అన్నట్టుగా కుండపోత దంచికొట్టింది. వరుణుడు సృష్టించిన బీభత్సం ఊహకందనివిధంగా ఉంది. గ్రామాలకు గ్రామాలే కనుమరుగయ్యేంతగా వరద ముంచెత్తింది. జల విలయానికి జనజీవనం కకావికలమైంది. కళ్లు మూసి తెరిచేలోపే పెను విధ్వంసం జరిగిపోయింది. అలర్ట్‌ అయ్యేలోపే గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img