Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపీపై అల్పపీడనం, ఆవర్తనం ప్రభావం..రెండు రోజుల పాటూ జోరు వానలు

వాయవ్య బంగాళాఖాతానికి ఆనుకుని.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ఒడిశా, చత్తీస్‌గఢ్‌ వైపు కదులుతూ రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అలాగే నైరుతి రుతు పవన ద్రోణి కూడా తోడయ్యింది. ఈ ప్రభావంతో మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడిరచారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి తెలిపారు. తవఅలాగే గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ చెబుతోంది. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. అంతేకాదు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img