Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపీలో ఉపాధి హామీ పథకంను విజయవంతంగా అమలు చేస్తున్నాం : మంత్రి పెద్దిరెడ్డి

ఏపీలో ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది పనిదినాలను గ్రామీణ పేదలకు కల్పించడంలో గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శాసనసభలో గురువారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడిరచారు.కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లేబర్‌ బడ్జెట్‌ 23.50 కోట్ల పనిదినాలకు గాను, ఇప్పటి వరకు 22.45 కోట్ల పని దినాలను వినియోగించుకున్నామని తెలిపారు. ఇందులో ఎస్సీలకు 5.20 కోట్లు అంటే 23.58 శాతం, ఎస్టీలకు 2.26 కోట్లు అంటే 10.14 శాతం, మహిళలకు 14.82 కోట్లు అంటే 57.26 శాతం పనిదినాలను కల్పించామని తెలిపారు. 45.83 లక్షల కుటుంబాల నుంచి 75.32 లక్షల మంది వేతన దారులకు ఉపాధి కల్పించామని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ కింద రూ.7,507.54 కోట్లు వ్యయం చేశామని తెలిపారు. ఇందులో రూ. 4,908.19 కోట్లు వేతనాల రూపంలో కూలీలకు అందించడం జరిగిందన్నారు. మరో రూ.2,504.65 కోట్లు మెటీరియల్‌ కాంపోనెంట్‌ కోసం ఖర్చు చేశామని తెలిపారు. 3,82,130 కుటుంబాలు 100 రోజుల ఉపాధిని పూర్తిగా వినియోగించుకున్నాయని, పని చేసిన పదిహేను రోజుల్లోనూ 99.27 శాతం చెల్లింపులు చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img