Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపీలో కొత్త జిల్లాల్లో ఏప్రిల్‌ 2 నుంచి పాలన షురూ..

ఏపీ సర్కారు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. దీనిపై ఏపీ ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ స్పందించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాల స్వీకరణకు మార్చి 3 తుది గడువు అని వెల్లడిరచారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టర్‌ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల విభజన ఇప్పుడు ఉండదని.. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందని పేర్కొన్నారు. ఆర్డర్‌ టూ వర్క్‌ ప్రాతిపదికన మాత్రమే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపు జరుగుతుందన్నారు. రాయలసీమ జిల్లాల నుంచి 1600 అభ్యంతరాలు వచ్చాయన్నారు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడిరచారు. ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని విజయ్‌కుమార్‌ తెలిపారు.
కాగా ఏపీ ప్లానింగ్‌ సెక్రటరీ విజయకుమార్‌, సర్వే ల్యాండ్‌ రికార్డుల శాఖ కమిషనర్‌ సిద్ధార్థ్‌ జైన్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ శనివారం అనంతపురంలో పర్యటించింది. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌ కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో ఉన్నతాధికారుల బృందం భేటీ అయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల నుంచి అందిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలకు సంబంధించిన వివరాలు.. కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే మౌలిక సదుపాయాలపై రాయలసీమ జిల్లాల కలెక్టర్లు నివేదికలను అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img