Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేత

కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేసినా కొన్ని నిబంధనలు మాత్రం ఇంకా కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. మార్కెట్‌, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాల్లో కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. దుకాణ యజమానులు తమ సంస్థల్లోకి మాస్కు లేకుండా వచ్చేవారిని అనుమతిస్తే రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక రోడ్లపై మాస్కులు లేకుండా తిరిగే వారికి రూ. 100 పెనాల్టి విధించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img