Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఏపీలో పలు చోట్ల భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.తాజాగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె. కన్నబాబు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని.. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య చెన్నై సమీపంలో రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశముందని వెల్లడిరచారు. దీని ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పారు. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదనిహెచ్చరించారు.లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img