Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య

8 రాష్ట్రాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ
ఏపీలో వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలు
తొలి స్థానంలో నిలిచిన కేరళ

మన దేశంలో 8 రాష్ట్రాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. ఈ జాబితాలో ఏపీ రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో కేరళ ఉంది. ఈ వివరాలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 2021-22 గణాంకాల ప్రకారం ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు కేరళలో 1,114 మంది అమ్మాయిలు ఉండగా, ఏపీలో 1,046 మంది అమ్మాయిలు ఉన్నారు. జాతీయ స్థాయిలో 963 మంది అమ్మాయిలు ఉన్నారు. ఏపీలో 2019-20 ఏడాదిలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలు ఉండగా… 2021-22 నాటికి ఆ సంఖ్య 1,046కి పెరిగింది.ఏపీలో మొత్తం 1,41,28,100 కుటుంబాలు ఉన్నాయి. వీటిలో పట్టణ ప్రాంతాల్లో 44,56,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 96,72,100 కుటుంబాలు ఉన్నాయి. సగటు కుటుంబ పరిమాణం 3.3గా ఉండగా… పట్టణాల్లో ఇది 3.2గా, గ్రామీణ ప్రాంతాల్లో 3.4గా ఉంది.

2021-22లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిలు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఇవే:

కేరళ – 1,114
ఏపీ – 1,046
హిమాచల్‌ ప్రదేశ్‌ – 1,031
తమిళనాడు – 1,026
మేఘాలయ – 1,017
ఛత్తీస్‌ గఢ్‌ – 1,016
రaార‰ండ్‌ – 1,001

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img