Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్టంలో గరిష్ఠంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీల వరకు చేరింది. ఉత్తర కోస్తాలో మాత్రం సాధారణం కంటే అధికంగా ఉంది అని వాతావరణశాఖ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ఉష్ణోగ్రతల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. అలాగే, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణంగా, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, కడప, చింతూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. కడపలో ప్రసుతం సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఈ నెల 14, 15 తేదీలూ తేదీల్లో 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తిరుపతి, నెల్లూరు అనంతపురం, ఒంగోలు తదితర ప్రాంతాల్లో 33 డిగ్రీల నుంచి 38.3 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img