Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు..

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. రాయలసీమ, కోస్తాఆంధ్రాలోని పలు ప్రాంతాలు ఇప్పటికే నీటమునిగాయి.జలప్రళయంతో దాదాపు 50మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలదన్నట్టు మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటూ వెదర్‌ రిపోర్ట్‌ ప్రజలను వణికిస్తోంది. మరో మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని ాతావరణశాఖ మరో హెచ్చరిక చేసింది.నిన్న దక్షిణ అండమాన్‌ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3 .1కిలోమీటర్లు ఎత్తులో విస్తరించిఉంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఒక అల్పపీడన ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలనుంచి తమిళనాడు తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 3 .1కిలోమీటర్లు ఎత్తులో వ్యాపించి ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రభావంతో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img