Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఏపీలో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు

ఏపీలో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులో కలిపి ఏపీలో ఒమిక్రాన్‌ కేసులు నాలుగుకు చేరాయి. విదేశాల నుంచి వచ్చిన విశాఖ, తూర్పుగోదావరి జిల్లావాసులకు ఒమిక్రాన్‌ నిర్థారణ అయనట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిరచారు. తూర్పుగోదావరి జిల్లా అయినవెల్లి మండలం నేదునూరిపాలెనికి చెందిన మహిళకు,విశాఖకు చెందిన వ్యక్తికి వైరస్‌ నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లా మహిళ ఇటీవలే కువైట్‌ నుంచి వచ్చింది. ఈ నెల 19న ఆమె విజయవాడ గన్నవరంలో దిగి కారులో నేదునూరిపాలేనికి వచ్చినట్లు వెల్లడిరచారు. దీంతో ఆమెను కాంటాక్ట్‌ అయిన కుటుంబసభ్యులుకు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమెతోపాటు.. యూఏఈ నుంచి విశాఖ వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి ఓమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యాధికారులు వెల్లడిరచారు. ఇద్దరిని క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. కాగా.. అంతకుముందు కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నమోదైంది. కెన్యా నుంచి వచ్చిన మహిళ.. చెన్నై విమానాశ్రయం నుంచి తిరుపతికి వచ్చినట్లు అధికారులు వెల్లడిరచారు.ఇదిలాఉంటే.. దేశంలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రోజురోజురోజుకూ పెరుగుతోంది. భారత్‌లో ఇప్పటివరకు 358 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img