Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూళ్లలో ప్రతి నెలలో రెండో శనివారం సెలవు!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ అన్ని రకాల స్కూళ్లకు నెలలో రెండో శనివారం సెలవు ఉంటుందని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ జులై నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు ఇది అమల్లో ఉంటుందని.. ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు తరగతులు, సెషన్లు కూడా నిర్వహించడానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.వేసవి సెలవుల తర్వాత మంగళవారం నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం 220 పనిదినాలుగా నిర్ణయించారు.. జాతీయ విద్యావిధానంలో భాగంగా ఆరెంచెలగా విద్యా విధానం కొనసాగనుంది. పీపీ-1, పీపీ-2 లగా ప్రీ ప్రైమరీ.. శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లగా ఈ విద్యాసంవత్సరమే ప్రారంభమవుతున్నాయి. ఫౌండేషన్‌, ఫౌండేషన్‌ ప్లస్‌ గా ప్రాధమిక విద్య.. ప్లీ హైస్కూలు, హైస్కూలు ప్లస్‌గా మార్పు చేశారు. పాఠశాలలు ప్రారంభయ్యే తొలిరోజునే విద్యార్ధులకి జగనన్న విద్యాకానుక అందజేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న విద్యాకానుక మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ.910 కోట్ల వ్యయంతో 47.40 లక్షల మంది విద్యార్ధులకి జగనన్న విద్యాకానుక అందించారు. మూడేళ్లలో జగనన్నవిద్యాకానుకకి ప్రభుత్వం రూ.2368 కోట్లు ఖర్చు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img