Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలకు ఫీజుల ఖరారుపై ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 53, 54 జీవోలను చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోలను సవాలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. సోమవారం ఉన్నత న్యాయస్థానంలో దీనిపై విచారణ జరిగింది. ప్రైవేట్‌ స్కూళ్లు, జూ.కాలేజీలకు మీరెలా ఫీజులు ఖరారు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జీవో ఇచ్చారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏపీలోని అన్ని ప్రైవేట్‌ స్కూళ్లు, జూ.కాలేజీలకు ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. ప్రతి ప్రైవేట్‌ స్కూళ్లు, జూ.కాలేజీల అభిప్రాయాలను తీసుకున్నాకే.. ఫీజులు ఖరారు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది ముతుకుమల్లి శ్రీవిజయ్‌ వాదించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img