Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపీ సచివాలయంలో కొవిడ్‌ ఆంక్షలు ఎత్తివేత

కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలు ఎత్తివేసే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా సచివాలయంలో కొవిడ్‌ ఆంక్షలను సడలించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన, ముఖ్య, కార్యదర్శులంతా విధిగా కార్యాలయానికి రావాలని ఆదేశించారు. కోవిడ్‌ 19 నిబంధనలు ఎత్తివేసినందున తప్పనిసరిగా సచివాలయంలోని ఆయా శాఖల కార్యాలయాల నుంచే విధులు నిర్వహించాల్సిందిగా ఉన్నతాధికారులకు సీఎస్‌ సూచించారు. ప్రజలకు ఇంతకాలం జరిగిన అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ఉన్నతాధికారులు కూడా బయోమెట్రిక్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌ వేర్‌ ద్వారా హాజరు నమోదు చేయాలని సీఎస్‌ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని సమావేశాలకు ఉన్నతాధికారు విధిగా హాజరు కావాలన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img