Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఒకట్రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు : సీఎం జగన్‌

కొవిడ్‌ పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్షించారు.కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని అలాగే
రాష్ట్రంలో ఇకపై తిరుపతి రుయా తరహా ఘటనలు పునరావృతం కాకూడదని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని రుయా ఆస్పత్రి ఆవరణలో అంబులెన్స్‌ డ్రైవర్లు మాఫియాలా తయారై..ఓ అభాగ్యుడితో అమానవీయంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం జగన్‌ తీవ్రంగా స్పందించారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలన్నారు. అలాగే ఆరోగ్యమిత్రల కియోస్క్‌ల వద్ద ఈ నంబర్లు స్పష్టంగా డిస్‌ప్లే అయ్యేలా చూడాలన్నారు. ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా వెంటనే ఆ నంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఒకట్రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని..అలాంటి పరిస్థితి రాకూడదని ఆన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సమర్థవంతమైన ప్రోటోకాల్‌ ఉండాలన్నారు. విజయవాడ ఆస్పత్రి లాంటి ఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ?పోలీసులు మరింత విజిలెంట్‌గా, అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం అంటే.. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం అన్నివేళలా మంచిచేయాలి. దీనికోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. కట్టుదిట్టంగా ఉండాలి.ఇలాంటి ఘటనలు జరక్కుండా మరింత గట్టిగా వ్యవహరించాలని పేర్కొన్నారు. విద్య, వైద్యం-ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img