Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కరోనా ఎఫెక్ట్‌ : పాఠశాలల్లో ప్రార్థనలు, ఆటలు బంద్‌

ఏపీ సర్కారు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇకపై ఉదయం పూట ప్రార్థనలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో క్రీడలు నిర్వహించవద్దని తెలిపింది. విద్యార్థులు ఒకే చోట గుమికూడకుండా అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిరచింది.పాఠశాల గదులను, ఆవరణను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలని ఆదేశించింది. జిల్లా విద్యాధికారులు జిల్లా వైద్యాధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుండాలని, విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ కరోనా బారిన పడితే వెంటనే చికిత్స అందించేలా చూడాలని తెలిపింది. మాస్కులు ధరిస్తూ, భౌతికదూరాన్ని పాటించాలని చెప్పింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img