Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కాపు రిజ‌ర్వేష‌న్లపై ప్ర‌భుత్వంపై వ‌త్తిడి తెండి : హైకోర్టు

కాపులకు ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌పై వేసవి సెలవుల అనంతరం జూన్‌లో తుది విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది. విద్యా, ఉపాథి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ తీసుకు వచ్చిన చట్టాన్ని, జీవో 60ను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్వస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి విదితమే. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యల తో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. హరిరామజోగయ్య తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ జోక్యం చేసుకుంటూ గత ప్రభుత్వ హయాంలో కాపులకు ఈడబ్ల్యూఎస్‌ కోటా 10 శాతంలో ఐదు శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తూ చట్టం తెచ్చిందని గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img