Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కార్మిక ఐక్యతను దెబ్బతీస్తే సహించం

పోరాట కమిటీ నేతల హెచ్చరిక
విశాలాంధ్ర`కూర్మన్నపాలెం (విశాఖ) : కార్మికుల ఐక్యతను భంగపరిస్తే సహించేది లేదని విశాఖ ఉక్కు పరిపరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద 206వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో సీఎంఎం, సీఎంఈ, టెలింక, ఈటీఎల్‌, సీఈడీ, టౌన్‌ ఆడ్మిన్‌ విభాగాల నాయకులు, కార్యకర్తలు కూర్చుకున్నారు. కమిటీ ప్రతినిధులు డి.ఆదినారాయణ, ఎన్‌. రామారావు, గంధం వెంకట్రావు, కె.సత్యనారాయణరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఉద్యమాలన్నీ ఐక్య ఉద్యమాలకు ప్రతీకగా నిలుస్తాయని వివరించారు. ఈ ఐక్యతను దెబ్బతీసేలా ఎవరు కుయుక్తులు పన్నినా తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఐక్యతను బలపరుస్తూ రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి ఒకే స్వరం వినిపించారని గుర్తుచేశారు. బీజేపీ మైండ్‌గేమ్‌ని ప్రతిఘటించేలా కార్యాచరణను నిర్మించుకుంటామన్నారు. ఐక్యత మరింత బలపడాలంటే స్టీల్‌ కార్మికవర్గం మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీక్షా శిబిరంలో విభాగాల ప్రతినిధులు భానుమూర్తి, వాసు, గుమ్మడి శ్రీనివాసరావు, రామచంద్రరావు, రాధాకృష్ణ, మోహన్‌, రవిచంద్ర, అన్నపూర్ణ, రామారావు, అప్పలరాజు, రమణ, రాజేశ్వరరావు, కె.సత్యనారాయణ, వేణు సహా అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img