Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కార్మిక హక్కుల పరిరక్షణకు పోరు

. కడప బహిరంగ సభలో ఓబులేసు పిలుపు
. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సమ్మేళనాలు ప్రారంభం

విశాలాంధ్ర – కడప బ్యూరో: దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న మోదీ, జగన్‌ ఇద్దరూ కార్మిక వ్యతిరేక శక్తులనీ, కార్పొరేట్‌ అనుకూల మిత్రులని వీరిద్దరిని గద్దెదించాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు నొక్కిచెప్పారు. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సమ్మేళనాల ప్రారంభం సందర్భంగా శనివారం కడప నగరంలో కార్మిక ర్యాలీ అనంతరం మున్సిపల్‌ ఉర్దూ స్కూల్లో కడప జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్‌ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహిం చారు. ఓబులేసు మాట్లాడుతూ నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో కార్మిక వర్గం అనేక అవస్థలు పడుతున్నారని, ఈ దేశ ఆర్థిక సంపదకు మూలకాంణమైన కార్మికులపై కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారని చెప్పారు. కార్పొరేట్‌ అనుకూల శక్తిగా మారి, దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆదాని, అంబానీలకు ధారధత్తం చేస్తూ బ్రిటిష్‌ నాటి కాలంలో పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. అనేక కార్మిక పోరాటాల ఫలితంగా సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించి కార్మికులకు రక్షణ లేకుండా చేశారరన్నారు. కనీస వేతనాలు అమలు చేయడం లేదని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పనిచేస్తున్న కార్మికులను ఉద్యోగులుగా గుర్తించకుండా వేతనాలు పెంచకుండా ప్రచార అర్బటాలకు మోదీ ప్రభుత్వం పరిమితమైంద న్నారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం కార్మికుల సంక్షేమా నికి తూట్లు పొడుస్తూ కనీసం కార్మికుల సమస్యలు తెలుసు కోకుండా రాజకీయ కుమ్ములాటలతో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడానికి రాష్ట్ర రాజకీయం సరిపోయిందన్నారు. కార్మిక చట్టాల పరిరక్షణకు రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.రవీంద్రనాథ్‌, డిప్యూటీ కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ పరిపాలనతో కార్మిక వర్గం కుదేలవుతుం దని పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీలను అమలు చేయకుండా వేతనాలు పెంచకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా, సీపీిఎస్‌ రద్దు చేయకుండా పోరాటం చేస్తే అరెస్టులు నిర్బంధాలు చేయడం ఈ ప్రభుత్వానికి అల వాటుగా మారిందన్నారు. మహిళలు అని చూడకుండా కనీస వేతనాలు అడిగితే నిర్భందించడం సిగ్గుచేటైన విషయమన్నారు. భవన నిర్మాణ కార్మికుల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అన్యా యంగా బొక్కేసి కార్మికుల కడుపు కొడుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకి కార్మికలోకం సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు రాధా కృష్ణమూర్తి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చలసాని రామారావు, కోశాధికారి కొండలరావు, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ రాజారెడ్డి, నాగసుబ్బారెడ్డి, మునెప్ప, పడాల రమణ, లలితమ్మ, రమేశ్‌ బాబు, సుబ్బరాయుడు, సోమసుందర్‌, శాంతి, స్రవంతి, శివయ్య గిరి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img