Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కుప్పంలో హైటెన్షన్‌

స్టేషన్‌కు చంద్రబాబు ప్రచార వాహనం-పోలీసుల అదుపులో సిబ్బంది
ఏపీలో విపక్ష నేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పర్యటించేందుకు సిద్ధమవుతున్న వేళ.. పోలీసులు కొరడా రaళిపిస్తున్నారు. తాజాగా కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో పోలీసులు ఆయన ప్రచార వాహనాన్ని, అందులో సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఇతర నేతల్ని కూడా కుప్పం రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో ఇవాళ ఉదయం నుంచి వందల మంది పోలీసులు మోహరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి శాంతిపురం మండలానికి పోలీసుల్ని తరలించారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో.. టీడీపీ ప్రచార రథం, సౌండ్‌ వాహనం పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. అలాగే డ్రైవర్లు, సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పర్యటనలో సౌండ్‌ సిస్టమ్‌ కోసం అనుమతి కోరుతూ ఇప్పటికే టీడీపీ నేతలు లేఖ ఇచ్చారు. అయినా పోలీసులు పట్టించుకునే పరిస్ధితి కనిపించడం లేదు. అలాగే కెనామాకులపల్లి గ్రామంలో చంద్రబాబు రచ్చబండ కార్యక్రమం కోసం టీడీపీ ఏర్పాటు చేసిన స్టేజీని సైతం పోలీసులు తొలగించారు. చంద్రబాబు పర్యటించే తొలి గ్రామంతో సహా మండలంలో అన్ని చోట్ల భారీగా పోలీసులు మోహరించారు. ప్రతి గ్రామంలో, కూడళ్ళలో పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. మరో రెండు గంటల్లో బెంగుళూరు నుంచి పెద్దూరు గ్రామం చేరుకోనున్న చంద్రబాబు.. పోలీసు ఆంక్షల నేపథ్యంలో ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img