Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కూల్చివేత‌ల‌లో నిబంధ‌నలను పాటించాల్సిందే – హైకోర్టు

  • ముద్రిత నమూనాలో ఉత్తర్వులు ఇకపై చెల్లవు.. నిబంధనలకు అనుగుణంగా లేని ఉత్తర్వులు చట్ట విరుద్ధంగా పరిగణించాల్సి ఉంటుంది.. ఏదో యాంత్రికంగా సంతకాలు చేస్తే కుదరదని హైకోర్టు పురపాలక కమిషనర్లకు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో మునిసిపల్‌ కమిషనర్లు నిర్దిష్ట ముద్రిత నమూనాలో జారీ చేయటానికి వీల్లేదని తేల్చిచెప్పింది. యాం త్రికంగా జారీచేసే ఉత్తర్వులను నిలుపుదల చేయాలని పురపాలకశా ఖను ఆదేశించింది. ముద్రిత నమూనాలో ఉండే ఉత్తర్వులకు చట్టబ ద్ధతలేదని నిబంధనలను అనుసరించి న్యాయస్థానాల ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిందే అని కమిషనర్లను ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఇళ్లు, భవనాలను కూల్చివేసేట ప్పుడు సంబధిత యజమానికి నోటీసు ఇచ్చి వారి వివరణలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తగిన కారణాలతో కూల్చివేతలో సాను కూలత లేదా వ్యతిరేకత ఉన్నప్పటికీ అలాంటి ఉత్తర్వులు ఎందుకు జారీచేయాల్సి వచ్చిందో నిర్దిష్ట కారణాలను ఉత్తర్వుల్లో వివరించాలని నిర్దేశించింది. ఏదో ఒక లైన్‌ వివరణ రాసి ముద్రిత నమూనాలో ఉత్త ర్వులు జారీచేస్తే ఇకపై చెల్లవని పునరుద్ఘాటించింది. ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలకు పంపి అమలు చేసేలా చూడా లని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ కీలకమైన తీర్పు వెలువరించింది. మునిసిపల్‌ కమిషనర్లు జారీచేసే ఇలాంటి ఉత్తర్వు లను సవాల్‌ చేస్తూ భారీగా పిటిషన్లు దాఖలవుతున్నాయి.. కమిషనర్లు తమ ఉత్తర్వుల్లో కారణాలను వివరించకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు.. ఆస్తి హక్కును రాజ్యాంగం కల్పించింది.. చట్ట నిర్దేశిత ప్రక్రియలో కాకుండా మరో విధంగా ఆ హక్కును ఎవరూ హరించలేరు.. చట్ట నిబంధనలు.. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగాలేని ముద్రిత నమూనా ఉత్తర్వులు జారీ చేయటం ఉల్లంఘన కిందకే వస్తుందని వివరించింది. ఇలాంటి ఉత్తర్వులపై యాంత్రికంగా సంతకంచేసి ఇవ్వటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. బాధితులు ఇచ్చే వివరణను విధిగా పరిగణనలోకి తీసుకోవాలని కారణాలు చెప్పటానికి సాకులు చూపరాదని స్పష్టం చేసింది.

ఈరకమైన ఉత్తర్వులను నిలుపుదల చేయాల్సిందే అని చెప్తూ కూల్చివేతలో రబ్బర్‌ స్టాంప్‌ కారణాలు చూపరాదని వ్యాఖ్యానించిం ది. చట్ట నిర్దేశిత నిమయాల ప్రకారం ఉత్తర్వులు జారీ చేయనందునే పురపాలకశాఖ చట్టం ఉద్దేశం నెరవేరడంలేదని దీంతో అనవసరంగా కోర్టుల చుట్టూ ప్రదక్షిణలుచేసి వ్యయ, ప్రయాసలకు గురవుతున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథతిల్హారీ తీర్పునిచ్చారు. ఏలూరు పట్టణానికి చెందిన ఐ రత్నప్రసాద్‌ తన రెండంతస్థుల భవనంలో కొంత భాగాన్ని కూల్చివేయాల్సి ఉందంటూ మునిసిపల్‌ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ రవినాథ తిల్హరీ విచారణ జరిపారు. పిటిషనర్‌ తరుపున న్యాయవాది వెంకయ్య వాదనలు వినిపించారు. భవనంలో కొంత భాగం దెబ్బతినటంతో పిటిషనర్‌ మరమ్మత్తులు చేయిస్తున్నారని అయితే ఏ రకంగా నిబంధనలు అతిక్రమించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు.

అయితే స్థానికంగా ఉండే ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదును అనుసరించి నిర్మాణాన్ని ఎందుకు తొలగించరాదో వివరణ ఇవ్వాలని కమిషనర్‌ నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు లోబడే నిర్మాణాలు జరుపుతు న్నామని ఇందులో ఉల్లంఘన ఏమీలేదని కొత్తగా అక్రమ నిర్మాణాలు చేయటంలేదని పిటిషనర్‌ వివరణ ఇచ్చారని తెలిపారు. మరో నోటీసు ఇచ్చినా ఇదేరకమైన సమాధానమిచ్చారని అయినా కమిషనర్‌ నిర్మా ణాలు తొలగించాల్సిందిగా ఏప్రిల్‌ 24వ తేదీన ఉత్తర్వులు జారీచేశారని పిటిషనర్‌ ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణాల ను ఎందుకు తొలగిస్తున్నారో కారణాలు తెలపకుండా కమిషనర్‌ ఉత్త ర్వులు జారీ చేయటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మునిసిపల్‌ కమిషనర్‌ హాజరుకు ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు మునిసిపల్‌ కమిషనర్‌ వెంకట కృష్ణ స్వయంగా హాజరయ్యారు. ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ తరుపు న్యాయవాది నరేష్‌కుమార్‌ జోక్యం చేసుకుంటూ నిర్దిష్ట ముద్రిత నమూనా ప్రకారమే అన్ని మునిసిపాల్టిలు తుది ఉత్తర్వులు జారీ చేస్తున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ ప్రకారం వివరాలను మార్చి డిజిటల్‌ సంతకాలతో కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేస్తుంటారని గుర్తుచేశారు.

వాదనలు విన్న న్యాయమూర్తి బాధితులు సంతృప్తికరమైన వివరణ ఇవ్వని పక్షంలోనే తదుపరి చర్యలకు ఆస్కారం ఉంటుందని కమిషనర్‌ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. యజమాని ఇచ్చిన వివరణ సంతృప్తికరంగాలేదని తేలిస్తే సరిపోదన్నారు. అందుకు కారణాలను కూడా వివరించాలని పూర్తి స్థాయిలో యజమానుల వివరణను కూడా ఉత్తర్వుల్లో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. యజమానులు ఇచ్చే వివరణ ఎందుకు సం తృప్తికరంగాలేదో కారణాలను తెలియజేస్తూ పూర్తిస్థాయిలో ఉత్తర్వు లు జారీ చేయాలని తీర్పునిస్తూ ఈ ప్రతులను రాష్ట్రంలోని అన్ని మునిసిపల్‌ కమిషనర్లకు అందేలా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శికి కూడా కాపీని అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ప్రస్తుత కేసులో ఓ వ్యక్తి ఆస్తిని తొలగించేందుకు, కూల్చివేతకు జారీచేసే ఉత్తర్వులు చెల్లుబాటుకావని అలా చేస్తే రాజ్యాంగం ప్రసాదించిన హక్కును హరించటమే అవుతుందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img