Friday, April 26, 2024
Friday, April 26, 2024

కృష్ణా జ‌లాల పంచాయితీ..రంగంలోకి కేంద్రం..

కృష్ణాలో నీటి కేటా యింపులు లేకుండానే అప్పర్‌ భద్ర వంటి భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్న కర్ణాటక 75 శాతం నీటి వాటాను తెరమీదకు తీసుకువస్తోంది. ఈ నెపంతో నికర జలాల పేరుతో వరద జలాలను కృష్ణా ఎగువన తమ ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు లకు తరలించేందుకు వ్యూహం పన్నుతోంది. దీనిలో భాగంగానే కృష్ణా నికర జలాల్లో 75 శాతం నీటిని వాడుకునేలా బ్రజేష్‌ కుమార్‌ -టైబ్యునల్‌ (కృష్ణా నదీ వివాదాల ట్రిబ్యునల్‌ ఉ కెడబ్ల్యుడిటి-2) 2103లో ఇచ్చిన తీర్పును నోటిఫై చేయాల్సిందిగా పట్టు-బడుతోంది. దీనిపై సుప్రీంకోర్డును కూడా ఆశ్రయించింది. కర్ణాటక డిమాండ్‌ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అప్పట్లోనే వ్యతిరేకించగా రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా సుప్రీంకోర్టులో వాదనలు సాగాయి. తెలంగాణ కూడా సుప్రీంలో కౌంటర్‌ దాఖలు చేసింది. కృష్ణా జలాల కేటాయిం పుల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో తాము తీవ్రంగా నష్టపోయామని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img