ఏపీలో రోడ్లు, పక్క రాష్ట్ర రహదారులు పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా : సీపీఐ నారాయణ
ఏపీ గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వ్యాఖలను పలువురు ఏపీ మంత్రులు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలను తాను ఏకీభవిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్`తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించిన ఆయన ఏపీ రోడ్ల దుస్థితి, తమిళనాడు రోడ్ల గురించి వీడియోలో వివరించారు. ఏపీలో రోడ్లు, పక్క రాష్ట్ర రహదారులు రెండిరటి మధ్య పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. నగరి మండలంలో తన స్వగ్రామమైన అయనంబాకం గ్రామానికి వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయని తెలిపారు.